T20 Wordl Cup 2024 : మహిళల టీ20 ప్రపంచ కప్ వేదిక ఖరారు కావడంతో అన్ని దేశాలు స్క్వాడ్‌ను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు తమ వరల్డ్ కప్ బృందాన్ని వెల్లడించాయి. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సైతం పొట్టి వరల్డ్ కప్ కోసం 15 మందితో కూడిన సైన్యాన్ని ప్రకటించింది. వెటరన్ ఆల్‌రౌండర్ హీలీ మాథ్యూస్(Hayley Mathews) కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. ఈమధ్యే వీడ్కోలు నిర్ణయం వెనక్కి తీసుకున్న డియోండ్ర డాటిన్(Deandra Dottin)కు సెలెక్టర్లు అవకాశమిచ్చారు.
ఈసారి అనుభవజ్ఞులతో, యువరక్తంతో కలగలసిన బృందాన్ని ఎంపిక చేశామని విండీస్ క్రికెట్ అధ్యక్షుడు కిశోర్ షాల్లో(Kishore Shallow) తెలిపాడు. ‘వరల్డ్ కప్ కోసం అనుభవజ్ఞులైన సీనియర్లతో పాటు యువకెరటాలను ఎంపిక చేశాం. స్క్వాడ్‌లో కొందరి వయసు 19 ఏండ్లు మాత్రమే. అందుకని పటిష్ఠమైన స్క్వాడ్‌ను సెలెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని వెల్లడించాడు.
The #MaroonWarriors are set to take on the world in the upcoming ICC Women’s T20 World Cup. 🏆 We proudly announce our 1️⃣ 5️⃣ chosen to represent the West Indies!🏏🌴 #WIBelieve #WIWomen pic.twitter.com/CdvdsJ6xDR
— Windies Cricket (@windiescricket) August 29, 2024
వెస్టిండీస్ వరల్డ్ కప్ స్క్వాడ్ : హేలీ మాథ్యూస్(కెప్టెన్), షెమైనె కాంప్‌బెల్, అలియాహ్ అల్లెనె, అఫీ ఫ్లెచర్, అశ్మిని మునిసర్, చెడీన్ నేషన్, చెనెల్లె హెన్రీ, డియాండ్ర డాటిన్, కరిష్మా రమ్హరాక్, మండీ మంగ్రు, నెరిస్సా క్రాఫ్టన్, క్వియనా జోసెఫ్, షమిల్లా కొన్నెల్, స్టఫనీ టేలర్, జైదా జేమ్స్.