IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఒకే ఒక విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) భారీ స్కోర్ చేసింది. సొంత మైదానంలో ఓపెనర్ మిచెల్ మార్ష్(60), ఎడెన్ మర్క్రమ్(53) అర్ధ శతకాలతో విజృంభించగా ముంబై ఇండియన్స్‌కు లక్ష్యాన్ని నిర్దేశించింది లక్నో. పవర్ ప్లేలో చెలరేగి ఆడగా.. మిడిల్ ఓవర్లలో మర్క్రమ్ బౌండరీలతో ముంబై బౌలర్లను ఉతికేశాడు. ఆయుష్ బదొని(30)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పి.. జట్టు స్కోర్ 150 దాటించాడు. డెత్ ఓవర్లలో పుంజుకున్న ముంబై.. ఈ ఇద్దరిని పెవిలియన్ పంపింది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్(27) ధనాధన్ ఆడడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన లక్నోకు ఓపెనర్లు మిచెల్ మార్ష్(60 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎడెన్ మర్క్రమ్(53 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు)లు శుభారంభం ఇచ్చారు. భీకర ఫామ్‌లో ఉన్న మార్ష్ తొలి ఓవర్ నుంచే దంచుడు మొదలుపెట్టి ముంబైని ఒత్తిడిలో పడేశాడు. బౌల్ట్ , దీపక్ చాహర్ బౌలింగ్‌లో పెద్ద షాట్లతో బౌండరీలు రాబట్టిన అతడు.. యువపేసర్ అశ్వినీ కుమార్‌నూ వదల్లేదు. అతడు వేసిన 6వ ఓవర్లో వరుసగా 6, 4, రెండు పరుగులు తీసి అర్ధ శతకం సాధించాడు మార్ష్. 27 బంతుల్లోనే 7ఫోర్లు, 2 సిక్సర్లతో ఫిఫ్టీకి చేరువయ్యాడు. దాంతో, లక్నో జట్టు 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 58 పరుగులు చేసింది. అయితే.. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత బంతి అందుకున్న విఘ్నేశ్ పుతూర్ డేంజరస్ మార్ష్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు.
Innings Break!#LSG set a target of 2️⃣0️⃣4️⃣ courtesy of half-centuries from Mitchell Marsh and Aiden Markram!
Will #MI register a consecutive win in #TATAIPL 2025?#LSGvMI pic.twitter.com/JrAG5JK1vn
— IndianPremierLeague (@IPL) April 4, 2025
మార్ష్ ఔటయ్యాక లక్నో స్కోర్ నెమ్మదించింది. ఆ కాసేపటికే నికోలస్ పూరన్(12)ను పాండ్యా బోల్తాకొట్టించగా.. కెప్టెన్ రిషభ్ పంత్(2) మరోసారి నిరాశపరుస్తూ పెవిలియన్ చేరారు. వీళ్లిద్దరూ ఔట్ కాగా.. 107కే మూడు వికెట్లు పడిన దశలో అయుష్ బదొని(30)అండగా మర్క్రమ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించి జట్టు స్కోర్ 150 దాటించాడు. దూకుడుగా ఆడే క్రమంలో అశ్వినీ కుమార్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికెల్టన్కు బదొని చిక్కగా.. పాండ్యా ఓవర్లో భారీ షాట్ ఆడిన మర్కరమ్ వెనుదిరిగాడు.
Comeback Mode 🔛
Vignesh Puthur and Hardik Pandya bring #MI back in the game after #LSG started strong.
LSG are 100/2 after 10 overs.
Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @mipaltan pic.twitter.com/DJLmeKnOVn
— IndianPremierLeague (@IPL) April 4, 2025
వీళ్లిద్దరూ వెనువెంటనే ఔట్ కావడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది. డెత్ ఓవర్లో అబ్దుల్ సమద్(4) నిరాశపరచగా.. డేవిడ్ మిల్లర్(27) తన విశ్వరూపం చూపించాడు. పాండ్యా వేసిన 20వ ఓవర్లో 6,4 కొట్టడంతో లక్నో 200లకు చేరుకుంది. అయితే.. పాండ్యా వరుస బంతుల్లో మిల్లర్, ఆకాశ్ దీప్‌లను పెవిలియన్ పంపాడు. దాంతో, నిర్ణీత ఓవర్లలో లక్నో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పాండ్యా ఐదు వికెట్లు పడగొట్టాడు.