WTC Final : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు రెండో సెషన్లో పిచ్ ఏమాత్రం పేస్‌కు అనుకూలించకపోవడంతో సఫారీ బ్యాటర్లు స్కోర్ బోర్డును ఉరికిస్తున్నారు. భారీ ఛేదనలో రెండు వికెట్ల పడినా ఎడెన్ మర్క్రమ్(49 నాటౌట్) సాధికారిక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కెప్టెన్ తెంబా బవుమా(11 నాటౌట్) సైతం ఆసీస్ పేసర్లను సమర్ధంగా ఎదుర్కొంటున్నాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు ఇప్పటికే 38 బంతుల్లో 24 రన్స్ చేసింది. టీ బ్రేక్ సమయానికి సఫారీ జట్టు 2 వికెట్ల నష్టానికి 92 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది.
ఆసీస్ నిర్దేశించిన 282 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికాకు స్టార్క్ షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రియాన్ రికెల్టన్(6)ను ఔట్ చేసి కంగారూలకు బ్రేకిచ్చాడు. 9 పరుగులకే తొలి వికెట్ పడినా ఎడెన్ మర్క్రమ్(49 నాటౌట్) గోడలా నిలబడ్డాడు. వియాన్ మల్డర్(27) జతగా ధాటిగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించాడు. రెండో వికెట్‌కు 61 రన్స్ జోడించి ఆసీస్ గుండెల్లో గుబులు రేపారిద్దిరూ. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని స్టార్క్ విడదీశాడు. గల్లీలో లబూషేన్‌కు తేలికైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 70 వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
Two wickets for Starc, but it’s been a solid start to the chase by South Africa 👊
Ball-by-ball: https://t.co/u1ZgBoPw7F pic.twitter.com/SCEIrm5MQx
— ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2025
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ తెంబ బవుమా(11 నాటౌట్) పెద్ద షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. అయితే. స్కార్ట్ బౌలింగ్‌లో బవుమాకు లైఫ్ లభించింది. 2 పరుగుల వద్ద అతడిచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో స్మిత్ నేలపాలు చేశాడు. ఆ తర్వాత మర్క్రమ్, బవుమాలు చకచకా సింగిల్స్, డబుల్స్ తీస్తూ లక్ష్యాన్ని తగ్గిస్తూ వచ్చారు. దాంతో, సఫారీ టీమ్ టీ సమయానికి 2 వికెట్ల నష్టానికి 94 రన్స్ చేసింది. ఇంకా విజయానికి ఆ జట్టుకు 188 పరుగులు కావాలి.