Ultimate Kho Kho : రెండు సీజన్లుగా అభిమానులను అలరించిన అల్టిమేట్ ఖో ఖో (Ultimate Kho Kho) నవంబర్ 29 నుంచి షురూ కానుంది. మూడో సీజన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీలో తొలిసారి విదేశీ ఆటగాళ్లను కూడా అనుమతిస్తామని శుక్రవారం ఖోఖో ఫెడరేషనల్ ఆఫ్ ఇండియా (KKFI) ప్రకటించింది. ఆసక్తిగల విదేశీ ప్లేయర్లు త్వరలో జరుగబోయే వేలంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని కేకేఎఫ్ఐ అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ (Sudhanshu Mittal) వెల్లడించాడు.
‘అల్టిమేట్ ఖో ఖో మూడో సీజన్ నవంబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈసారి వేలంలో పాల్గొనేందుకు విదేశీ ఆటగాళ్లకు కూడా అనుమతి ఇస్తున్నాం. ఈ నిర్ణయంతో లీగ్‌లో పోటీతత్వం మరింత పెరుగుతుంది. అంతేకాదు అంతర్జాతీయంగా భారత్‌ను ఖో ఖో కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవకాశమూ దక్కుతుంది’ అని సుధాన్షు తెలిపాడు.
📸 𝐃𝐨𝐮𝐛𝐥𝐞 𝐭𝐡𝐞 𝐠𝐥𝐨𝐫𝐲, 𝐝𝐨𝐮𝐛𝐥𝐞 𝐭𝐡𝐞 𝐜𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬! 🇮🇳🏆#KhoKhoWorldCup #TheWorldGoesKho #Khommunity #KhoKho #KKWCMen #KKWC2025 pic.twitter.com/3ifDB6BGAV
— Kho Kho India (@India_KhoKho) January 20, 2025
ఐపీఎల్‌తో ఫ్రాంచైజీ క్రికెట్‌కు క్రేజ్ ఓ రేంజ్లో పెరిగింది. ఖోఖోకు కూడా అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే ఆలోచనతో అల్టిమేట్ ఖోఖో లీగ్‌కు శ్రీకారం చుట్టింది హాకీ ఇండియా.2022లో తొలాసారిగా అల్టిమేట్ ఖో ఖో లీగ్‌ను ప్రారంభించారు. ఆరంభ సీజన్లో ఒడిషా జగ్గర్నాట్స్ విజేతగా అవతరించింది. 2023-24లో జరిగిన రెండో సీజన్లో గుజరాత్ జెయింట్స్ కప్‌ను ఎగరేసుకుపోయింది. వరుసగా రెండు సీజన్లలో ఫైనల్ చేరినప్పటికీ రాంజీ కశ్యప (Ramji Kashyap) జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.