బజార్ హత్నూర్ : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీ నగేష్ ( MP Nagesh ) , ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ( MLA Anil Jadav ) అన్నారు. గిరిజన అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో శుక్రవారం బజార్ హత్నూర్ మండలం జాతర్ల గ్రామం జాతర్ల, మడగూడ, పార్డి, పట్నాపూర్ పాఠశాలకు చెందిన 185 మంది విద్యార్థులతో సామూహిక అక్షరభ్యాస ( Mass literacy Programme) కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలల్లో సరస్వతి దేవి చిత్ర పటానికి వేద పండితుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే చిన్నారులను ఒళ్లో కూర్చోబెట్టుకొని అక్షర శ్రీకారం చేయించారు. వారు మాట్లాడుతూ సర్కార్ బడుల్లోనే ఎంతో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, నాణ్యమైన విద్య తో పాటు మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాల పంపిణి ప్రభుత్వం అందిస్తుందని గుర్తు చేశారు.
విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే వసతులను తెలియచేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమం లో ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, జిల్లా క్రీడాధికారి పార్థసారధి, మండల విద్యాధికారి కిషన్ గుప్తా, ఏసీఎంవో జగన్, జీసీడీవో ఛాయా, ప్రధానోపాధ్యాయులు కిషన్ రెడ్డి చందన్, సుదర్శన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.