నెల్లికుదురు జూన్ 13 : అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టికలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్ఐ చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రామకృష్ణ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న అశోక లేలాండ్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 45 బస్తాల్లో 22.50 క్వింటాల నల్ల బెల్లం 5 బస్తాల్లో 2.5 క్వింటాల పటికలు లభ్యమయ్యాయి.
వీటి విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. సంబంధిత నల్ల బెల్లం, పట్టికలను భూక్య అరుణ్ బాదావత్ సుమన్ భానోత్ గణపతి రవీందర్ కార్తీక్ లు బీదర్ నుండి మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు నాటుసారా తయారీదారులకు సప్లై చేస్తున్నారు ఆ ఐదుగురిపై కేసు నమోదు చేసి సంబంధిత నల్ల బెల్లం పట్టికలను స్వాధీనం చేసుకొని వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.