మునుగోడు, జూన్ 13 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, కావునా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి కోరారు. శుక్రవారం మునుగోడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ తలమల్ల మల్లేశంతో కలిసి విద్యార్థులచే సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుంకరి భిక్షంగౌడ్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజయ్య, ఉపాధ్యాయులు ఎం.అన్నపురెడ్డి, సతీశ్, చంద్రమౌళి, విద్యా కమిటీ చైర్మన్ ఎండీ సాహేద, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Munugode : ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు : డీఈఓ భిక్షపతి