IPL 2024 SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో తమకు తిరుగులేదని ఆరెంజ్ ఆర్మీ(Orange Army) మరోసారి నిరూపించింది. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై రికార్డు స్కోర్‌తో చరిత్ర సృష్టించిన కమిన్స్ సేన.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను వణికించింది. తొలుత సీఎస్కేను 165 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్ స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. 6 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసి మెగా టోర్నీలో రెండో విజయం సాధించింది. ఈ విక్టరీతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.
స్వల్ప ఛేదనలో ఎస్ఆర్హెచ్ విజయంలో మాజీ సారథి ఎడెన్ మర్క్రమ్(50), ఓపెనర్ అభిషేక్ శర్మ(37), ట్రావిస్ హెడ్(31)లు తలా ఓ చేయి వేశారు. చిచ్చరపిడుగు హెన్రిచ్ క్లాసెన్(10 నాటౌట్) ఉతికేయగా.. లోకల్ బాయ్ నితిశ్ రెడ్డి(14 నాటౌట్) సిక్సర్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
Nitish Reddy seals the win for @SunRisers with a MAXIMUM 💥#SRH 🧡 chase down the target with 11 balls to spare and get back to winning ways 🙌
Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/lz3ffN5Bch
— IndianPremierLeague (@IPL) April 5, 2024
ఐపీఎల్లో అత్యధిక స్కోర్(277)తో చరిత్రను తిరగరాసిన హైదరాబాద్ బ్యాటర్లు శుక్రవారం రెచ్చిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను చీల్చిచెండారు. ముంబైపై అర్ధశతకంతో రికార్డు నెలకొల్పిన అభిషేక్ శర్మ.. చెన్నై బౌలర్లకు తన ప్రతాపం చూపించాడు. కేవలం 12 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 రన్స్ కొట్టాడు. ముకేశ్ ఛౌదరీ వేసిన తొలి ఓవరలో అభిషేక్ 4, 6, 6, 4తో 24 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వత దీపక్ చాహర్‌ను ఉతికేస్తూ సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో హైదరాబాద్ స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది. 46 పరుగుల వద్ద అభిషేక్ ఔటయ్యాడు.
Markram gets to his FIFTY but Moeen Ali finds a breakthrough for @ChennaiIPL 💛#SRH need 34 off 36
Follow the Match ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/aT4tmd1Mcx
— IndianPremierLeague (@IPL) April 5, 2024
ఆ తర్వాత హెడ్‌కు జత కలిసిన మర్క్రమ్ ధనాధన్ ఆడాడు. అయితే.. గైక్వాడ్ స్పిన్నర్లను రంగంలోకి దింపడంతో స్కోర్ వేగం తగ్గింది. మోయిన్ అలీ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడిన మర్క్రమ్ ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికీ 36 బంతుల్లో 34 పరుగులు కావాలి. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సిక్సర్ల మోత మోగించిన షహ్బాజ్ అహ్మద్(18)ను మోయిన్ ఔట్ చేశాడు. ఆతర్వాత క్లాసెన్(10 నాటౌట్), లోకల్ బాయ్ నితిశ్ రెడ్డి(14 నాటౌట్)లు మ్యాచ్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా మ్యాచ్ ముగించారు.
Pure entertainment 🔥 https://t.co/XwA2sZ6NrD
— SunRisers Hyderabad (@SunRisers) April 5, 2024
తొలుత చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ల జోరుకు హైదరాబాద్ బౌలర్లు కళ్లెం వేశారు. స్టార్లతో నిండిన చెన్నైని తక్కువకే నిలువరించారు. డేంజరస్ శివం దూబే(45), అజింక్యా రహానే(35)లు బౌండరీలతో చెలరేగినా చెన్నైని తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. కమిన్స్ సారథ్యంలోని పేస్ దళం వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచినా…చివర్లో రవీంద్ర జడేజా(31 నాటౌట్) దంచాడు. దాంతో, సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, నటరాజన్, ఉనాద్కట్, భువనేశ్వర్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
Muscled not once but TWICE 💥💥
Shivam Dube on a roll in Hyderabad! 🔥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvCSK | @IamShivamDube pic.twitter.com/0odsO9hgAv
— IndianPremierLeague (@IPL) April 5, 2024