Elephant | ఆపరేషన్ గజ సక్సెస్.. ప్రాణహిత దాటి మహారాష్ట్రలోకి వెళ్లిపోయిన ఏనుగు
Elephant |కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ గజ విజయవంతమైంది. సరిహద్దు మండలాల ప్రజలకు కునుకు లేకుండా చేసిన ఏనుగు ప్రాణహిత తీరం దాటి మహారాష్ట్రలోకి వెళ్లిపోయింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అధికారుల సహాయంతో జిల్లా అటవీశాఖ అధికారులు ఏనుగును సరిహద్దు దాటించారు.
Elephant |కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ గజ విజయవంతమైంది. సరిహద్దు మండలాల ప్రజలకు కునుకు లేకుండా చేసిన ఏనుగు ప్రాణహిత తీరం దాటి మహారాష్ట్రలోకి వెళ్లిపోయింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అధికారుల సహాయంతో జిల్లా అటవీశాఖ అధికారులు ఏనుగును సరిహద్దు దాటించారు.
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన ఈ ఏనుగు సరిహద్దు ప్రాంతాల ప్రజలను భయాందోళలకు గురి చేసింది. మూడు రోజుల క్రితమే రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన ఈ ఏనుగు చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో అల్లూరి శంకర్(55)ను, పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో కారు పోశన్న(65)ను బలితీసుకుంది. దీంతో ఈ గజరాజు మళ్లీ ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందారు. తక్షణమే ఆ ఏనుగును బంధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన బృందంతో పాటు జిల్లాలోని మూడు అటవీ శాఖ బృందాలు థర్మల్ డ్రోన్ల సాయంతో ఏనుగు జాడను గుర్తించాయి. శుక్రవారం ఉదయం కమ్మర్గాంలోని పల్లె ప్రకృతి వనంలో స్థానికులకు ఏనుగు కనిపించింది. మరికొంత సేపటికే జిల్లెడ, మొర్లిగూడ గ్రామాలకు వెళ్లే మార్గంలో ప్రయాణికుల కంట పడింది. కమ్మర్గాం-జిల్లెడ గ్రామాల మధ్య ఉన్న ముసలమ్మ గుట్ట వద్ద సుమారు 4 గంటల దాకా సేద తీరింది. అక్కడి నుంచి ఈ రాత్రి ప్రాణహిత దాటి మహారాష్ట్రకు వెళ్లిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

