కొలంబో: టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్(Vikram Rathour).. ఇప్పుడు శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌గా నియమితుయ్యాడు. ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టుకు ఆయన కోచ్‌గా సేవలు అందించనున్నాడు. ఇండియా, శ్రీలంక వేదికల్లో వరల్డ్‌కప్ జరగనున్న విషయం తెలిసిందే. కన్సల్టన్సీ బేసిస్ ఆధారంగా విక్రమ్ రాథోడ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. జనవరి 18వ తేదీన రాథోడ్ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నాడు. అయితే వరల్డ్‌కప్ పూర్తి అయ్యే వరకు అంటే మార్చి 10వ తేదీ వరకు లంక జట్టుతోనే విక్రమ్ రాథోడ్ ఉండనున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో విక్రమ్ రాథోడ్ ఇండియా తరపున ఆరు టెస్టులు, ఏడు వన్డేలు ఆడాడు. 2019 సెప్టెంబర్ నుంచి 2024 జూలై వరకు భారత బ్యాటింగ్ కోచ్‌గా చేశారు. బీసీసీఐ లెవల్ 3 కోచ్‌గా కొనసాగారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ సపోర్ట్ స్టాఫ్‌గా ఉన్నాడు.