Dipu Chandra Das : బంగ్లాదేశ్ లో గత నెలలో జరిగిన దీపు చంద్రదాస్ అనే హిందువు దారుణ హత్య ఘటనలో ప్రధాన నిందితుడిని బంగ్లా పోలీసులు అరెస్టు చేశారు. దీపు దాస్ హత్యకు స్తానికుల్ని రెచ్చగొట్టినట్లుగా భావిస్తున్న యాసిన్ అరాఫత్ ను అరెస్టు చేసినట్లు బంగ్లా పోలీసులు తెలిపారు. గత డిసెంబర్ 18న దీపు చంద్రదాస్ ను కొందరు ఇస్లామిస్టులు తను పనిచేసే ఫ్యాక్టరీ నుంచి బయటకు తీసుకొచ్చి, దాడి చేశారు.
అనంతరం అతడిని దహనం చేసి చంపేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన మిమెన్ సింగ్ ప్రాంతంలో నిందితుడు అరాఫత్ కు స్థానిక లీడర్‌గా పేరుంది. అతడు స్తానిక జనాన్ని పిలిచి, రెచ్చగొట్టి దీపుదాస్ పై దాడి చేసేలా ఉసిగొల్పాడు. ముందుగా దీపుపై దాడి చేసి, అనంతరం లాక్కొచ్చి, చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. ఈ ఘటనకు బాధ్యుడు అరాఫతే అని పోలీసులు అంటున్నారు. దీపు మరణం అనంతరం అరాఫత్ పారిపోయాడు. గురువారం అతడ్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దీపు హత్య తర్వాత మరో ఐదుగురు హిందువులపై కూడా అక్కడి ముస్లింలు దాడి చేసి, చంపేశారు. అమృత్ మోండల్, ఖోకోన్ దాస్, రాణా ప్రతాప్ వంటి వారు మరణించిన వారిలో ఉన్నారు.