Tiger Roaming | సరదాగా పార్క్‌కు వెళ్లిన టూరిస్ట్‌లకు షాకింగ్ అనుభవం ఎదురైంది. పార్కింగ్ ఏరియాలో అనుకోని అతిథి పలకరించింది. ఆ అతిథి ఎవరా అని ఆలోచిస్తున్నారా..? ఇంకెవరు పులి (Tiger).
రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్ (Ranthambore National Park)లో కోట సమీపంలోని పార్కింగ్ ఏరియాలోకి పులి పిల్ల ప్రవేశించింది. కోట గోడపై అటూఇటూ తిరుగుతూ కనిపించింది. పులిని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ఆ దృష్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రణథంబోర్ నేషనల్ పార్క్.. ప్రధానంగా పులుల సందర్శనకు గమ్యస్థానంగా ప్రసిద్ధి చెందింది. ల్యాండ్‌స్కేప్ ఫోటోగ్రఫీకి కూడా ప్రసిద్ధి.
Also Read..
ISRO: అంతరిక్ష డేటా సెంటర్ల ఏర్పాటుపై ఇస్రో దృష్టి
Man Killed in Police Firing | పొరుగువారిపై కత్తితో దాడి.. పోలీస్ కాల్పుల్లో వ్యక్తి మృతి
Vedanta Chairman | జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి.. కుమారుడి మృతిపై వేదాంత చైర్మన్ భావోద్వేగం