పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది.
ఇందులో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 43 మంది శాసనసభ్యులు సోమవారం రాజ్భవన్లో
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ వీరితో ప్రమాణం చేయించారు. వీరిలో 24 మంది కేబినెట్ మంత్రులు కాగా, 19 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మంత్రి మండలిలో సీనియర్ నేతలు, అనుభవజ్ఞులు, కొత్తవారికి చోటు దక్కింది.
సీఎం మమతా బెనర్జీతో కలిపి మంత్రివర్గంలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. బెంగాల్ రంజీ ఆటగాడు, భారత మాజీ క్రికెటర్, టీఎంసీ నేత మనోజ్ తివారీ సైతం మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నాడు. తివారీకి క్రీడా మంత్రిత్వ శాఖను కేటాయించినట్లు తెలిసింది.అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనోజ్..టీఎంసీ చీఫ్ మమతా ఆధ్వర్యంలో పార్టీలో చేరాడు. భారత్ తరఫున తివారీ 12 వన్డేలు, 3 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.
A new journey begins from today. Need all your love & support. 😊#DidiShowsTheWay #AssemblyElection #WestBengal #JoyBangla pic.twitter.com/TrrFX67USP
— MANOJ TIWARY (@tiwarymanoj) February 24, 2021