Lords Test : లార్డ్స్‌లో జరగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత్(Team India) జోరు చూపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ మళ్లీ మెరవగా టీమిండియా ఆధిక్యం పెరుగుతూ పోతోంది. మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లను బాదేస్తూ స్మృతి మంధాన(70) మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడగా.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన యస్తికా భాటియా(66 నాటౌట్) అర్ధ శతకంతో మెరిసింది. వీరిద్దరి మెరుపులతో టీమిండియా ఆధిక్యం మూడొందలు దాటింది. ప్రస్తుతం యస్తిక జతగా దీప్తి శర్మ క్రీజులో ఉంది.
ఏకైక టస్టులో భారత జట్టు చెలరేగిపోతోంది. లార్డ్స్‌లో పేసర్ క్రాంతి గౌడ్(5-37) తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ నడ్డివిరిచేయగా.. బ్యాటర్లు దంచేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో రెచ్చిపోయిన స్మృతి మంధాన(70) రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫిఫ్టీ కొట్టేసింది. మరో ఎండ్‌లో దూకుడుగా ఆడిన యస్తికా భాటియా(66 నాటౌట్) సైతం హాఫ్ సెంచరీతో కదం తొక్కగా టీమిండియా ఆధిక్యం మూడొందలకు చేరింది.
Starting the day on a positive note ✅
A well-composed 2⃣nd Test half-century for Yastika Bhatia 👏
Updates ▶️ https://t.co/O1rEau8j8n #TeamIndia | #ENGvIND | @YastikaBhatia pic.twitter.com/zLsxqKEja1
— BCCI Women (@BCCIWomen) July 12, 2026
అయితే.. మంధాన జెమీమా రోడ్రిగ్స్(3)లను ఔట్ చేసిన లారెన్ బెల్(2-27) ఆతిథ్య జట్టుకు బ్రేకిచ్చింది. కాసేపటికే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(16)ను ఎకిల్‌స్టోన్ ఎల్బీగా వెనక్కి పంపింది. టపటపా మూడు వికెట్లు పడడంతో యస్తిక, దీప్తి శర్మ(2 నాటౌట్)లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 215-4తో ఉన్న టీమిండియా 330 పరుగుల ఆధిక్యంలో ఉంది.