INDW vs SLW : పొట్టి సిరీస్‌లో భారత బ్యాటర్ల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. నామమాత్రమైన నాలుగో 20లో ఓపెనర్లు స్మృతి మంధాన(80), షఫాలీ వర్మ(79), అర్ధ శతకాలతో రెచ్చిపోయారు. ఆరంభం నుంచి పోటీపడి బౌండరీలు బాదిన వీరు శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఔటైనా రీచా ఘోష్(40 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 19వ ఓవర్లో వరుసగా తను పవర్ స్ట్రోక్‌తో 6, 6, 4, 6 బాది స్కోర్ రెండొందలు దాటించింది. డెత్ ఓవర్లలో రీచా విధ్వసంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221పరుగులు చేసింది.
పొట్టి సిరీస్‌లో తొలిసారి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ కొట్టింది. త్రివేండ్రంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంక బౌలర్లకు దడ పుట్టిస్తూ ఓపెనర్లు షపాలీ వర్మ(79), స్మృతి మంధాన(80)లు శుభారంభమిచ్చారు. షెహానీ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదిన మంధాన.. ఆ తర్వాత కావ్య బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు రాబట్టింది. వరుసగా రెండు అర్ద శతకాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న షఫాలీ సైతం ఫోర్లతో విరుచుకుపడింది. లంక కెప్టెన్ వేసిన ఆరో ఓవర్లో షషాలీ రెండు ఫోర్లు సంధించింది. దాంతో.. పవర్ ప్లేలో టీమిండియా 61 రన్స్ చేసింది.
80(48) by Smriti Mandhana 👌
79(46) by Shafali Verma 💪A blistering opening partnership of 1⃣6⃣2⃣(92) by the #TeamIndia openers 👏
Updates ▶️ https://t.co/9lrjb3dMqU #INDvSL | @TheShafaliVerma | @mandhana_smriti | @IDFCFIRSTBank pic.twitter.com/xnGfsBObSw
— BCCI Women (@BCCIWomen) December 28, 2025
పవర్ ప్లే తర్వాత కూడా మంధాన, షఫాలీ జోరు కొనసాగింది. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన మంధాన బ్యాట్ ఝులిపించగా.. మరో ఎండ్‌లో షఫాలీ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ సాధించింది.14.2కే స్కోర్ 150 దాటింది. షఫాలీ ఔటైన తర్వాత రీచా ఘోష్(40 నాటౌట్) దూకుడుగా ఆడింది. మంధాన కూడా వెంటనే వెనుదిరిగాక స్కోర్ వేగం తగ్గింది. అయితే.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(16 నాటౌట్) జతగా రీచా రెచ్చిపోయింది. కవిశ దిల్హరి వేసిన 19వ ఓవర్లో ఈ ఫినిషర్ వరుసగా 6,6, 4, 6 బాది 23 రన్స్ పిండుకోగా స్కోర్ రెండొందలు దాటింది. చివరి ఓవర్లో హర్మన్‌ప్రీత్ 6, 4 కొట్టగా 14 పరుగులు వచ్చాయి. ఈ ద్వయం మూడో వికెట్‌కు 23 బంతుల్లోనే 53 రన్స్ రాబట్టగా.. శ్రీలంకకు అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. హ్యాట్రిక్ ఓటములతో సిరీస్ సమర్పించుకున్న లంక బోణీ కొడుతుందా? లేదా? చూడాలి.