INDW vs SLW : మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు (Team India) భారీ స్కోర్ చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన(60) మరోసారి అర్ధ శతకంతో మెరిసింది. మిడిలార్డర్లో జెమీమా రోడ్రిగ్స్(29) ధనాధన్ ఆడగా ఆఖర్లో రీచా ఘోష్(30) బౌండరీలతో విధ్వంసం సృష్టించింది. దాంతో, టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 రన్స్ కొట్టింది.
లంక బౌలర్లు స్పిన్‌తో కట్టడి చేయడంతో భారత్ స్కోర్ 140 దాటడమే కష్టమనిపించింది. కానీ, మంధాన ఔటయ్యాక వచ్చిన రీచా ఘోష్ మెరుపు బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. కవిష దిల్హరి వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది జట్టు స్కోర్ 150 దాటించింది. ఆఖరి ఓవర్లోనూ రీచా బౌండరీ కొట్టి ఔట్ కావడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 రన్స్ కొట్టింది.సెమీ ఫైనల్లో పాకిస్థాన్‌పై 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు అపసోపాలు పడ్డ లంక ఈసారి ఏం చేస్తుందో చూడాలి.
Innings Break!
Vice-captain @mandhana_smriti‘s elegant 60(47), and brisk knocks from @JemiRodrigues (29 off 16) & @13richaghosh (30 off 14) help #TeamIndia post 165/6.
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/RRCHLLmNEt#WomensAsiaCup2024 | #INDvSL | #ACC | #Final pic.twitter.com/j5UgyYeq3R
— BCCI Women (@BCCIWomen) July 28, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ(16), ఉమా ఛెత్రీ(9)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో, స్మృతి మంధాన(60), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(11)లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. వీళ్లిద్దరూ లంక స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ మూడో వికెట్‌కు 29 పరుగులు జోడించారు.
𝗕𝗶𝗴 𝗺𝗮𝘁𝗰𝗵 𝗽𝗹𝗮𝘆𝗲𝗿 💪#WomensAsiaCup2024 #ACC #HerStory #SLWvINDW #GrandFinale pic.twitter.com/yrMrvhDy4Y
— AsianCricketCouncil (@ACCMedia1) July 28, 2024
అయితే.. సచిని నిసన్సల ఓవర్లో హర్మన్‌ప్రీత్ సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ కాసేపటికే భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో మంధాన వికెట్ పారేసుకుంది. ఆ దశలో భారత జట్టు స్కోర్ 140 దాటితే గొప్ప అనిపించింది. కానీ, రీచా ఘోష్(0) తన విధ్వంసంతో లంక బౌలర్లకు చుక్కలు చూపించింది. 19వ ఓవర్లో ఏకంగా రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది స్కోర్ 150 దాటించింది. ఆఖరి ఓవర్లోనూ ఆమె బౌండరీ కొట్టి.. మూడో బంతికి ఔటయ్యింది. దాంతో టీమిండియా 167 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టుకు నిర్దేశించింది.