Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్ పోషించిన కెప్టెన్ మిల్లర్ (Captain Miller) ఈ ఏడాది జనవరి 12న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ధనుష్ తాజాగా రాయన్ (Raayan) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
స్వీయ దర్శకత్వంలో టైటిల్ రోల్ పోషించగా.. సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. తాజాగా రాయన్ అరుదైన ఫీట్ నమోదు చేసింది. రాయన్ మూడు రోజుల గ్లోబల్ గ్రాస్ కెప్టెన్ మిల్లర్‌ను అధిగమించనుంది. తాజా అప్డేట్ ప్రకారం రాయన్ రెండు రోజుల గ్లోబల్ వసూళ్లు రూ.50 కోట్లకుపైగా నమోదయ్యాయి. ధనుష్‌కు ఇదే సరైన బర్త్ డే గిఫ్ల్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
డీ50వ (D50)గా తెరకెక్కిన రాయన్ చిత్రంలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, ఎస్జే సూర్య , కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.
విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో వస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్, నివేదితా సతీశ్, ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
#Raayan ‘s three days global gross will be higher than @dhanushkraja ‘s this year’s Pongal release #CaptainMiller. Such is the magnitude of Raayan’s phenomenal opening.
2 days global gross – 50cr+ 💥💥 Happy birthday @dhanushkraja pic.twitter.com/C5RlcHmt0Z
— Rajasekar (@sekartweets) July 28, 2024
Kubera | బర్త్ డే స్పెషల్.. ధనుష్ కుబేర నయా లుక్ వైరల్
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Raayan | ధనుష్ రాయన్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాం ఇదే..!