సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండాలని నిర్ణయించుకుందట అచ్చ తెలుగందం శ్రీలీల. ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉందీ భామ. సక్సెస్ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా భారీ ఆఫర్లలొస్తున్నప్పటికీ.. ఇక ముందు పర్ఫార్మెన్స్ పరంగా ఛాలెజింగ్ రోల్స్‌ని ఎంచుకోవాలని ఈ సొగసరి గట్టి నిర్ణయం తీసుకుందట. గత ఏడాది తెలుగులో పెద్ద చిత్రాల్లో నటించినా ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, కమర్షియల్ మూవీస్‌లో కూడా ప్రయోగాత్మక కథలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో ఆమె ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో తమిళ అరంగేట్ర చిత్రం ‘పరాశక్తి’పై ఎన్నో అంచనాల్ని పెట్టుకుంది శ్రీలీల. ఈ నెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. రత్నమాల పాత్రలో ఆమె లుక్స్‌తో పాటు ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. తన కెరీర్లోనే అభినయపరంగా ఇదొక వైవిధ్యమైన పాత్ర అని శ్రీలీల చెబుతున్నది. ప్రస్తుతం ఈ భామ హిందీలో అనురాగ్‌బసు దర్శకత్వంలో ‘ఆషికీ-3’ చిత్రంతో పాటు సైఫ్అలీఖాన్ తనయుడు ఇబ్రహీంఖాన్‌తో కలిసి ‘డైలెర్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నది. పవన్‌కల్యాణ్ సరసన ఆమె నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వేసవిలో రిలీజ్ కానుంది.