శర్వానంద్ కథానాయకుడిగా తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ ‘భోగి’. సంపత్‌నంది దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. 1960 నేపథ్యంలో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో జరిగే ఈ కథ కోసం అప్పటి కాలమాన పరిస్థితుల్ని ప్రతిబింబించేలా హైదరాబాద్‌లో భారీ సెట్‌ను నిర్మించారు.
ఇందులో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో సరికొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిదని, తెలంగాణ నేటివిటీతో భావోద్వేగ ప్రధానంగా మెప్పిస్తుందని చిత్రబృందం పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడు.