రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 7న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇద్దరు భామలతో కథానాయకుడి లవ్‌స్టోరీతో పాటు కథలోని ఆసక్తికరమైన అంశాలను ట్రైలర్లో రివీల్ చేయబోతున్నామని, ఈ ముక్కోణపు ప్రేమాయణం తాలూకు కామెడీ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందించిన పాటలు ఇప్పటికే అద్భుత ప్రజాదరణ పొందాయని చిత్రబృందం పేర్కొంది. అషికా రంగనాథ్, డింపుల్ హయాతి, సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ప్రకాష్, రచన-దర్శకత్వం: కిషోర్ తిరుమల.