అమరావతి : ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani ) పేర్కొన్నారు. ఏ అంటే అమరావతి(Amaravati), పీ అంటే పోలవరం (Polavaram) ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అభివృద్ధికి అడుగులు వేస్తుందని వెల్లడించారు.
గుంటూరులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లోనూ ఏపీకి అధిక ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చయినా భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. అమరావతికి రూ. 2,500 కోట్లతో రైల్వేజోన్( Railway Zone) మంజూరైందని అన్నారు.
రూ.12 వేల కోట్ల నుంచి రూ. 15 వేల కోట్ల విలువైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వడానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి రెండు మేజర్ పారిశ్రామిక కారిడార్లు రానున్నాయని వివరించారు. వివిధ ప్రాజెక్టుల రూపంలో దాదాపు రూ. 80 వేల కోట్ల నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు.
AP News | జగనన్న పేరుతో ఉన్న పథకాల పేర్లను మార్చేసిన చంద్రబాబు సర్కార్