MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మిస్టర్ కూల్‌కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ధోనీ ఎక్కడికి వెళ్లినా ఆయన ఆటోగ్రాఫ్, సెల్ఫీ కోసం ఎగబడుతుంటారు. తాజాగా ఓ అభిమాని ధోనీపై ఉన్న తన ప్రేమను బయటపెట్టాడు. విమానాశ్రయంలో ధోనీని చూసిన అభిమాని ‘మహీ భాయ్ ఐ లవ్ యూ’ (Mahi Bhai I Love You) అంటూ గట్టిగట్టిగా అరిచాడు. దీనికి మిస్టర్ కూల్ స్మైల్ ఇస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
42ఏళ్ల ఈ మిస్టర్ కూల్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ లీగ్ తప్ప మిగతా ఏడాదంతా ధోనీ క్రికెట్‌కు దూరంగానే ఉంటున్నాడు. అయినప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
Fan : Mahi bhai I love you ❤
Thala : Smiles 😁@msdhoni #MSDhoni pic.twitter.com/W6SXlb6E1r— FAN🚩 (@KattarDhoni) September 29, 2023
Also Read..
Viral Video | లగ్జరీ ఆడీ కారులో వచ్చి.. ఆకు కూరలు అమ్మిన రైతు.. వీడియో
Elon Musk | అసాల్ట్ రైఫిల్‌తో ఫైరింగ్.. యాక్షన్ హీరో లెవల్లో మస్క్.. వీడియో