IPL 2025 : ఐపీఎల్ వేలం కంటే ముందు ఏ ఫ్రాంచైజీ ఎవరిని వదిలేస్తుంది? అనేది అంతుచిక్కడం లేదు. అక్టోబర్ 31కి మరో మూడు రోజులే ఉన్నందున అన్ని ఫ్రాంచైజీలు దాదాపు తుది జాబితా సిద్దం చేసే ఉంటాయి. అయితే.. స్టార్ ఆటగాళ్లను వదిలేస్తాయా? అట్టిపెట్టుకుంటాయా? అనేది సందేహాలు రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితుల్లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) తమ రిటెన్షన్ జాబితాను ఖరారు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
పద్దెనిమిదో సీజన్ కోసం ఆరుగురిని అట్టిపెట్టుకునేందుకు బీసీసీసీ అనుమతిచ్చింది. ఈసారైనా కప్ కొట్టాలనే కసితో ఉన్న లక్నో స్క్వాడ్‌లో సమూల మార్పులు చేయనుంది. నిలకడే కొలమానంగా తీసుకొని గత గత రెండు సీజన్లుగా అద్భుతంగా రాణించిన ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలని లక్నో యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతానికి ఐదుగురిని రిటైన్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసింది.
అందుకని ఐపీఎల్ 18వ సీజన్ కోసం చిచ్చరపిడుగు నికోలస్ పూరన్ (Nicholas Pooran)ను తొలి ప్రాధాన్యంగా ఆ తర్వాత పేస్ సంచలనం మయాంక్ యాదవ్ (Mayank Yadav), యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను రిటైన్ చేసుకోనుంది. అన్క్యాప్డ్ ప్లేయర్లుగా ఆకాశ్ బదొని, పేసర్ మొహ్సిన్ ఖాన్లు జట్టుతో కొనసాగనున్నారు.
కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) భవితవ్యంపై ఫ్రాంచైజీ ఇంకా నిర్ణయానికి రాలేదని సమాచారం. రాహుల్ మాత్రం మళ్లీ లక్నోతో ఆడాలని అనుకోవడం లేదట. ఇదే విషయాన్ని అతడు టీమ్ సమావేశంలో చెప్పాడని కథనాలు వచ్చాయి. అదే జరిగితే.. రాహుల్‌ను వదిలేసి పూరన్‌కు పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో పూరన్ ముంబై జట్టును చాంపియన్‌గా నిలిపాడు. కాబట్టి అతడి వైపు యాజమాన్యం మొగ్గు చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు ఈ ఐదుగురికి లక్నో ఎంత ధర చెల్లించనుంది? అనేది తెలియాల్సి ఉంది.
Rahul Released By LSG, These 5 Players Retained Ahead Of Auction: Report https://t.co/sTou0FPph6 pic.twitter.com/k68LsQu5Ex
— CricketNDTV (@CricketNDTV) October 28, 2024
కేఎల్ రాహుల్ సారథ్యంలో లక్నో ప్లే ఆఫ్స్‌కే పరిమితం అయింది. మోకాలి గాయం కారణంగా 16వ సీజన్ నుంచి మధ్యలోనే వైదొలిగిన రాహుల్.. 17వ సీజన్లో పెద్దగా రాణించలేదు. అతడి కెప్టెన్సీ కూడా ఫ్రాంచైజీని మెప్పించలేదు. దాంతో, స్టేడియంలో అందరూ చూస్తుండగానే రాహుల్‌పై లక్నో యజమాని సంజీవ్ గొయెంకా (Sanjeev Goenka) ఆగ్రహం చేసిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత సంజీవ్ ఈ వివాదానికి తెరదించినా రాహుల్ మాత్రం జట్టును వీడేందుకే సిద్దమయ్యాడట. 2022 మినీ వేలంలో లక్నో రూ.17 కోట్లు పెట్టి రాహుల్‌ను కొన్నది.
NICHOLAS POORAN TO RECEIVE 18CR FROM IPL 2025. 🥶
– Pooran will be the top retention of LSG. (Espncricinfo).pic.twitter.com/hZZu9XClvh
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 28, 2024