SDT 18 | సాయి దుర్గ తేజ్ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ SDT18. రోహిత్ కేపీ (Rohit KP) దర్శకత్వం (డెబ్యూ) వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మేకర్స్ ఇప్పటికే SDT18 గ్లింప్స్ షేర్ చేయగా.. ఆర్కాడీ ప్రపంచంలోకి ప్రత్యేక ప్రవేశం.. అంటూ సాయి దుర్గ తేజ్ కండలు తిరిగిన దేహంతో శక్తివంతమైన శూలాన్ని పట్టుకొని స్టన్నింగ్ విజువల్స్‌తో పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నట్టు చెబుతోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు నారప్ప, జార్జిరెడ్డి, రాక్షసులు సినిమాలకు పని చేసిన గాంధీ నడికూడికర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నాడు. గాంధీనడికూడికర్కు స్వాగతం చెబుతూ విడుదల చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. పాన్ ఇండియా కథాంశంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఐశ్వర్యలక్ష్మి వసంత పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షేర్ చేసిన వసంత లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రం 1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్టు గ్లింప్స్ ద్వారా తెలుస్తుండగా.. సాయి దుర్గ తేజ్ యోధుడి పాత్రలో నటిస్తున్నట్టు హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని హనుమాన్ మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.
Team #SDT18 welcomes the brilliant Production Designer @GNadikudikar on board ❤️🔥 pic.twitter.com/MPqDFcf78p
— BA Raju’s Team (@baraju_SuperHit) October 28, 2024
Matka | వరుణ్ తేజ్ మట్కాలో పుష్ప యాక్టర్.. ట్రెండింగ్‌లో లుక్
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి