Warner – Khawaja : ప్రపంచ క్రికెట్లో గొప్ప ఓపెనర్లలో డేవిడ్ వార్నర్(David Warner), ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) జోడీ ఒకటి. సుదీర్ఘ ఫార్మాట్లో కంగారూ జట్టు సంచలన విజయాల వెనక ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. నిరుడు ఓవల్(Oval)లో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC 2023) గెలవడంలో వార్నర్, ఖవాజా పాత్ర మరువలేనిది. మైదానంలో కలిసి ఆడే ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం చాలా మందికి తెలియదు. వార్నర్, ఖవాజా ఇద్దరూ చెడ్డీ దోస్తులు. జూనియర్ క్లబ్(Junior Club) స్థాయి నుంచి వీళ్లిద్దరూ కలిసి ఆడుతున్నారు. అయితే.. వార్నర్ అన్ని ఫార్మాట్ల ప్లేయర్‌గా గుర్తింపు పొందగా.. ఖవాజా మాత్రం సుదీర్ఘ ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు.
ఖవాజా, వార్నర్‌లు ఒకే ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేశారు. ఖవాజా 2011 జనవరిలో తొలి టెస్టు ఆడగా.. వార్నర్ డిసెంబర్లో అరంగేట్రం చేశాడు. వీళ్ల ఫ్రెండ్షిప్ డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కాలేదు. పెండ్లి తర్వాత కూడా తమ స్నేహాన్ని కొనసాగించారు. ఇప్పటికీ వార్నర్, ఖవాజా కుటుంబాలు అన్యోన్యంగా ఉండడం చెక్కు చెదరని వీళ్ల స్నేహబంధానికి నిదర్శనం.
టెస్టు గదతో ఖవాజా, వార్నర్
ఆట పరంగా ఒకరిది దూకుడే మంత్ర కాగా.. మరొకరిది నిదానమే ప్రదాన అనే ధోరణి. అందుకనే కాబోలు మైదానంలో వీళ్ల జోడీ బంపర్ హిట్ అయింది. ఇప్పటివరకూ వీళ్లిద్దరూ 66 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ చేశారు. 44.39 సగటుతో 2,841 పరుగులు సాధించారు. వార్నర్ వీడ్కోలు టెస్టులో ఖవాజా కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. తన ఆత్మీయ మిత్రుడిని మైదానంలో మిస్ అవుతాననే బాధ అతడిలో కనిపించింది.
David Warner ends his Test career opening with Usman Khawaja, with whom he played junior club cricket with
A long partnership. A partnership beyond cricket 🤝 pic.twitter.com/Y7jH8uL40z
— ESPNcricinfo (@ESPNcricinfo) January 7, 2024
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో వీడ్కోలు మ్యాచ్ అనంతరం వార్నర్ భావోద్వేగానికి లోనయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ ఖవాజా తల్లి ఫొజియా తారిక్(Fozia Tariq) ని ప్రేమగా హత్తుకున్నాడు. అనంతరం ఇరువురు భార్యా పిల్లలతో కలిసి ఫొటోలు దిగారు.
‘My mum loves him. She calls him Shaytan. Devil. Satan. My mum loved the fact that he was the devil. And it wasn’t her son that she could just push it back to Lorraine and Howard [Warner’s parents]’
David Warner and Fozia Tariq, the mother of Usman Khawaja ❤️ pic.twitter.com/jGS7Na5OIe
— ESPNcricinfo (@ESPNcricinfo) January 6, 2024
ప్రపంచ క్రికెట్లో గొప్ప క్రికెటర్లుగా, గొప్ప స్నేహితులుగా తమ ముద్ర వేసిన వార్నర్, ఖవాజా కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు చవిచూశారు. ఒకరికి కష్టమొస్తే మరొకరు నేనున్నానంటూ అండగా నిలిచారు. ఈ మధ్యే వార్నర్ టెస్టు కెరీర్‌పై మాజీ పేసర్ మిచెల్ జాన్సన్(Mitchell Jhonson) వ్యాఖ్యల్ని ఖవాజా తప్పు పట్టిన విషయం తెలిసిందే. అందుకనే వీళ్లిద్దరిని చూసినవాళ్లకు బాలీవుడ్లో పాపులర్ అయిన ‘హే దోస్తీ హమ్ నహీ చోడేంగే’ పాట గుర్తుకు రావడం ఖాయం.