Pakistan Cricket Board : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగిన పాకిస్థాన్ క్రికెటర్ అబ్రర్ అహ్మద్ (Abrar Ahmed) చిక్కుల్లో పడ్డాడు. వైద్యుల సలహాలను పాటించడం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. గాయం కారణంగా టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న ఈ లెగ్ స్పిన్నర్ పాక్ వైద్య బృందం సలహాల్ని పాటించడం లేదు.
వన్డే వరల్డ్ కప్ ముందు హబిలిటేషన్(Rehabilitation)లో ఉన్నప్పుడు కూడా అబ్రర్ వేళకు మందులు తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేశాడు. దాంతో, పాకిస్థాన్ జట్టు డాక్టర్, ఫిజియో, ట్రైనర్తో మాట్లాడిన అనంతరం పీసీబీ చైర్మన్కు రిపోర్టు పంపించారు. ఈ రిపోర్టును పరిశీలించాక బోర్డు అతడిపై చర్యలు తీసుకోనుంది.
‘అబ్రర్ను నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపాం. అక్కడ రిహాబిలిటేషన్లో ఉండే అతడిని రోజూవారీగా వైద్యులు పర్యవేక్షించనున్నారు’ అని పీసీబీ తెలిపింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో గాయపడిన అబ్రర్ సియాటికాతో బాధపడుతున్నాడు. దాంతో ఈ లెగ్ స్పిన్నర్ త్వరలో జరగనున్న న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు కూడా దూరం కానున్నాడు.