AP News | పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే ఉన్నానని.. నెల్లూరు ఎంపీగా పోటీచేస్తున్నా అని తెలిపారు. ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. సీఎం జగన్ ఏం చెబితే తాము అది చేస్తామని మంత్రి కాకాణి అన్నారు. వైసీపీపై దుష్ప్రచారం చేయడమే టీడీపీ లక్ష్యమని విమర్శించారు. తమ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని.. ఎవరూ పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు.