Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) చరిత్ర సృష్టించాడు. విశ్వ క్రీడల్లో సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన భారత తొలి పురుష షట్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చౌ థియెన్ చెన్(chou tien chen)పై లక్ష్య సేన్ గెలుపొంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 19-22, 21-15, 21-12తో చెన్కు భారత కెరటం చెక్ పెట్టాడు.
16వ రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన హెచ్‌హెస్ ప్రణయ్ (HS Prannoy)పై గెలుపొందిన లక్ష్యసేన్ క్వార్టర్స్‌లోనూ గర్జించాడు. తొలి సెట్లో వెనకబడిన భారత కెరటం.. రెండో సెట్లో పంజా విసిరాడు. 21-15తో చెన్పై ఆధిపత్యం చెలాయించాడు.
HISTORY SCRIPTED 🥹🇮🇳
1️⃣st ever Indian Men’s Singles shuttler to reach #Olympics semifinal 😍
Proud of you Lakshya, keep it up!
📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @Arunlakhanioffi #Paris2024#IndiaAtParis24#Cheer4Bharat#IndiaontheRise#Badminton pic.twitter.com/OzyZaIiwOL
— BAI Media (@BAI_Media) August 2, 2024
విజేతను నిర్ణయించే మూడో సెట్లోనూ లక్ష్య సేన్ అదే దూకుడు కనబరిచి ప్రత్యర్థిని చిత్తు చేశాడు. తద్వారా సెమీస్ చేరిన మూడో భారత షట్లర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. అతడి కంటే ముందు సైనా నెహ్వాల్ (Saina Nehwal), పీవీ సింధు (PV Sindhu)లు ఈ ఘనత సాధించారు.