Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో కోట్లాది మంది కలల్ని మోస్తున్న అథ్లెట్లకు గుడ్‌న్యూస్. ఒలింపిక్ విలేజ్(Olympic Village)లోని భారత బృందానికి కేంద్ర క్రీడా శాఖ ఏసీ(AC)లు సమకూర్చింది. విశ్వ క్రీడల గ్రామంలోని ఇండియన్ అథ్లెట్ కోసం ఏకంగా 40 ఏసీలు అందజేసింది. ఒలింపిక్స్ ముందు పారిస్‌లో చల్లగా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా వేడెక్కింది. ఒక్కోరోజు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు సెల్సియస్ నమోదు అవుతోంది.
అయితే.. భారత బృందానికి కేటాయించిన గదుల్లో ఏసీలు లేవు. దాంతో వాళ్లు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భారత క్రీడా శాఖ శుక్రవారం ఉదయం ఫ్రాన్స్‌లోని భారత దౌత్య కార్యాలయం, భారత ఒలింపిక్ సంఘాన్ని సంప్రదించింది. భారత బృందానికి ఏ లోటూ లేకుండా చూడాలనే ఉద్దేశంతో వాళ్లకు బస ఏర్పాటు చేసిన గదుల్లో ఏసీలను అమర్చించింది. దాంతో, అథ్లెట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్లు మూడు పతకాలు కొల్లగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్, టీమ్ ఈవెంట్లో మను భాకర్(Manu Bhaker) కంచు మోత మోగించింది. తొలుత వ్యక్తిగత విభాగంలో పతకంతో మెరిసిన మను.. ఆ తర్వాత సరబ్జోత్ సింగ్(Sarabjot Singh)తో కలిసి 10 మీటర్ల మిక్సడ్ ఈవెంట్లో కాంస్యం అందించింది. అనంతరం 25 మీటర్ల వ్యక్తిగత విభాగంలో స్వప్నిల్ కుసాలే(Swapnil Kusale) కాంస్య పతకంతో గర్జించాడు.