Srisailam | ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, అలమ్మట్టి, తుంగభద్రల నుండి శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుండి నాలుగు లక్షలకు క్యూసెక్కులకు పైగా ఇనో ఫ్లో వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు అధికారులు శుక్రవారం డ్యామ్ పది గేట్లను 20 అడుగుల ఎత్తులో తెరచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇప్పటి వరకు జూరాల ప్రాజెక్టు నుండి 3,03,927 క్యూసెక్కుల నీరు విద్యుదుత్పత్తి ద్వారా 17,706 క్యూసెక్కులు, సుంకేశుల నుండి 1,67,728 క్యూసెక్కుల ( మొత్తం 4,89,361 క్యూసెక్కులు ) నీరు శ్రీశైలానికి విడుదల అయింది. శుక్రవారం సాయంత్రం వరకు 4,42,977 క్యూసెక్కుల నీరు ఇనో ఫ్లో ద్వారా రిజర్వాయర్‌కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తులో తెరచి 4,66,650 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 61,761 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 883.30 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వలు 215.807 టీఎంసీలకు 206.0996 టీఏంసీలుగా నమోదైంది.
ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్‌లో కొత్త రికార్డు.. 7.28 కోట్లు దాటిన ఐటీఆర్స్..!
Stocks | ఆటో.. ఐటీ స్టాక్స్ పతనంతో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు .. !
UPI Payments | వరుసగా మూడో నెలలోనూ అదే రికార్డు.. జూలైలో రూ.20 లక్షల కోట్లు దాటిన యూపీఐ పేమెంట్స్..!
Bank of England | 5శాతం వడ్డీరేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్.. 16 ఏండ్ల గరిష్టం నుంచి కోత..!