Husband Kills Wife | మొబైల్ హాట్‌స్పాట్ షేర్ చేసేందుకు నిరాకరించిన భార్య.. హత్య చేసిన భర్త
Husband Kills Wife | మొబైల్ హాట్‌స్పాట్ షేర్ చేసేందుకు భార్య నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన భర్త ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
చండీగఢ్: మొబైల్ హాట్‌స్పాట్ షేర్ చేసేందుకు భార్య నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన భర్త ఆమెను హత్య చేశాడు. (Husband Kills Wife) ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 30న మదీనా గ్రామానికి చెందిన అజయ్ కుమార్, అతడి భార్య రేఖ వారి ఇంట్లో మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఆ సమయంలో అజయ్ మొబైల్ డేటా అయిపోయింది. దీంతో మొబైల్ హాట్‌స్పాట్ ఆన్ చేయమని భార్యను కోరాడు.
కాగా, తన మొబైల్ డేటా తక్కువగాఉందని భార్య రేఖ చెప్పింది. హాట్‌స్పాట్‌ను ఆన్ చేసేందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన అజయ్ పదునైన ఆయుధంతో భార్యపై దాడి చేశాడు. ఆమెను హత్య చేసి ఇంటి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రేఖ కుటుంబం ఫిర్యాదుతో ఆమె హత్యపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భర్త అజయ్‌ను అదే రోజు అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

