Hyderabad | హైదరాబాద్‌లోని చార్మినార్ జోన్-VI పరిధిలో 76 మందికి పదోన్నతి కల్పించారు. ఈ మేరకు మల్టీ జోన్ II ఐజీపీవీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్ జోన్ VI పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించామని ఐజీపీవీ ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. వీరందరూ సివిల్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారని వివరించారు.
డ్రగ్స్‌ను కంట్రోల్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అబ్కారీ భవన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాదాపూర్‌లో పట్టుబడిన రేవ్ పార్టీ నిందితుల సమాచారం మేరకు హైదారాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ వెంకట్ బాయ్స్ హాస్టల్లో దాడి నిర్వహించనపుడు ముగ్గురు నిందితులు పట్టుబడ్డారని తెలిపారు. వారి వద్ద రూ. 12 లక్షల విలువ చేసే ఎండిఎంఎ డ్రగ్స్ 250 గ్రాముల గంజాయి పట్టుబడిందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. ఆగస్టు 31 నాటికి ధూల్‌పేట్‌లో డ్రగ్స్‌ను, తెలంగాణవ్యాప్తంగా నాటుసారాను లేకుండా చేయడమే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ నెల చివరి వరకు మరింత పకడ్బందీగా దాడులు నిర్వహిస్తామని తెలిపారు.