Marnus Labuschange : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్ (Marnus Labuschange ) తనకు ఎంతో ఇష్టమైన బ్యాట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో (ODI World Cup Final) ఉపయోగించిన బ్యాట్‌కు ఆసీస్ దిగ్గజం తాజాగా గుడ్ బై చెప్పాడు. సోమవారం లబూషేన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాడు. ‘ప్రపంచ కప్ ఫైనల్ బ్యాట్‌కు వీడ్కోలు పలికేందుకు సమయం వచ్చేసింది’ అని అతడు ఆ పోస్ట్‌కు క్యాప్షన్ రాశాడు.
లబూషేన్ పెట్టిన పోస్ట్‌లోని బ్యాట్ పాక్షికంగా దెబ్బతిన్నది. బ్యాటు అడుగు భాగంలోని పై పొర కొంత ఊడివచ్చింది. అందుకనే కాబోలు ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ దాన్ని ఇక పక్కనపడేశాడు. ఇదే బ్యాటుతో లబూషేన్ వరల్డ్ కప్‌లో అదరగొట్టాడు. మొత్తం 10 ఇన్నింగ్స్‌ల్లో 40.22 సగటుతో 362 రన్స్ కొట్టాడు.
నిరుడు వరల్డ్ కప్ ఫైనల్లో లబూషేన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ నిర్దేశించిన 241 పరుగుల ఛేదనలో ఆదిలోనూ మూడు వికెట్లు పడినా పట్టుదలగా ఆడాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి టీమిండియా బౌలర్లపై దాడికి దిగాడు. శతక వీరుడు హెడ్(137)తో పాటు 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన లబూషేన్ భారత్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. దాంతో, ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే వరల్డ్ కప్ చాంపియన్‌గా రికార్డు నెలకొల్పింది.