Kohli – Rohit : భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)లు ఇక టెస్టు క్రికెట్‌పై దృష్టి పెట్టనున్నారు. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌లో కోల్పోయిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం ఇద్దరూ సన్నద్ధమవుతున్నారు. స్వదేశంలో జరుగనున్న ఈ సిరీస్‌లో సత్తా చాటేందుకు ఇద్దరూ దేశవాళీ ట్రోఫీ (Duleep Trophy)లో ఆడనున్నారు.
ఈసారి దులీప్ ట్రోఫీలో కోహ్లీ, హిట్‌మ్యాన్‌లు బరిలోకి దిగనున్నారు. వీళ్లతో పాటు పలువురు టీమిండియా టెస్టు ఆటగాళ్లు ఈ ట్రోఫీలో భాగం కానున్నారు. బీసీసీఐ రూల్స్ ప్రకారం టెస్టు జట్టుకి ఎంపికవ్వాలంటే ఆటగాళ్లు ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. అందుకని దులీప్ ట్రోఫీకి అందుబాటులో ఉండాలని సీనియర్ ఆటగాళ్లను బీసీసీఐ కోరింది. దాంతో రోహిత్, కోహ్లీలు ఈ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ వేదికగా సెప్టెంబర్ 5న దులీప్ ట్రోఫీ మొదలవ్వనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీలో శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు సైతం ఆడనున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న బంగ్లాదేశ్ ఆ తర్వాత భారత్‌కు రానుంది. ఇరుజట్ల మధ్య రెండు టెస్టులు, మూడు టీ20లు జరుగనున్నాయి. భారత్, బంగ్లాలు సెప్టెంబర్ 19వ తేదీన తొలి టెస్టులో తలపడనున్నాయి,