Tirumala | తిరుమలకు బైక్‌పై వెళ్లే భక్తులకు అలర్ట్. ఘాట్ రోడ్డులో టూవీలర్స్‌పై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే కొండపైకి ద్విచక్రవాహనాలను అనుమతించనున్నారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమలులో ఉన్నాయి. నిన్న రాత్రి మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కనిపించిన నేపథ్యంలో టీటీడీ ఈ ఆంక్షలు విధించింది.
తిరుమలలో ఇటీవల చిరుతలు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా ఓ చిరుత కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి చిరుత కలకలం సృష్టించింది. రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్డులోని 55, 56వ మలుపు సమీపంలో ఓ చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్లడాన్ని వాహనదారులు గుర్తించారు. భయాందోళనలకు గురైన భక్తులు వెంటనే టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.