Wimbledon : టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో టాప్ సీడ్ ఎలెనా రిబాకినా (Elena Rybakina)కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రిబాకినాపై బార్బొరా క్రెజికోవా (Barbora Krejcikova) సూపర్ విక్టరీ కొట్టింది. మాజీ చాంపియన్ ధాటికి ఆదిలో తడబడినా.. ఆ తర్వాత సంచలన ఆటతో చెక్ రిపబ్లిక్ భామ విజేతగా నిలిచింది.
తొలి సెట్ కోల్పోయిన క్రెజికోవా వరుసగా రెండు సెట్లను 6-3, 6-4తో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లింది. జూలై 13 శనివారం జరుగబోయే టైటిల్ పోరులో ఇటలీ కెరటం జాస్మినె పవోలినితో క్రెజికోవా తలపడనుంది. ఇద్దరికీ ఇదే తొలి వింబుల్డన్ ఫైనల్ కావడం విశేషం. దాంతో గ్రాస్ కోర్టులో కొత్త చాంపియన్‌గా అవతరించేది ఎవరు? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటలీ యువకెరటం జాస్మినె పవోలిని (Jasmine Paolini) వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్‌గా జేజేలు అందుకన్న జాస్మినె తొలి సీజన్లో వింబుల్డన్ ఫైనల్లో అడుగుపెట్టిది. తద్వారా మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ అమ్మాయిగా రికార్డు నెలకొల్పింది.
The stage awaits 🏟️#Wimbledon pic.twitter.com/IZClvcnAUS
— Wimbledon (@Wimbledon) July 12, 2024
గురువారం సెంటర్ కోర్టులో ఆద్యంతం ఉత్కంఠ రేపిన పోరులో డొన్నా వెకిక్‌పై 2-6, 6-4, 7-6తో జాస్మినె విజయ ఢంకా మోగించింది. దాంతో, ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఫైనల్లో కాలు మోపిన రెండో ప్లేయర్‌గా నిలిచింది. ఆమె కంటే ముందు ‘అమెరికా నల్ల కలువ’ సెరెనా విలియమ్స్ (Serena Williams) ఈ ఫీట్ సొంతం చేసుకుంది.