Swati Maliwal case | ఢిల్లీ హైకోర్టులో బిభవ్‌కు చుక్కెదురు.. ఎందుకంటే..!
Swati Maliwal case | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మాలివాల్ (Swati Maliwal) పై దాడి కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బిభవ్ కుమార్ (Bibhav Kumar) బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
Swati Maliwal case : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మాలివాల్ (Swati Maliwal) పై దాడి కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బిభవ్ కుమార్ (Bibhav Kumar) బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కోర్టు పూర్వపరాలను పరిశీలించన జస్టిస్ అనూప్ కుమార్ మెండిరట్ట.. నిందితుడికి ఇప్పటికిప్పుడు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదని వ్యా్ఖ్యానించారు.
కాగా, కేసు దర్యాప్తు పూర్తయినందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బిభవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. ప్రస్తుతం బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బిభవ్ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడన్న స్వాతి మాలివాల్ ఆరోపణల నేపథ్యంలో ఆయనను మే 18న పోలీసులు అరెస్ట్ చేశారు.
అప్పటి నుంచి నిందితుడిని కొన్ని రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించిన తీస్ హజారీ కోర్టు.. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అప్పటి నుంచి పోలీస్ అధికారుల విజ్ఞప్తి మేరకు కోర్టు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని పలు దఫాలుగా పెంచుతూ వస్తున్నది. కాగా బెయిల్‌పై బయటికి వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకని గత నెలలో స్వాతి మాలివాల్ ఆయన నివాసానికి వెళ్లారు.
అయితే అప్పాయింట్మెంట్ లేదన్న కారణంతో అధికారులు ఆమె సీఎంను కలిసేందుకు అనుమతి నిరాకరించారు. దాంతో స్వాతిమాలివాల్ అధికారులతో వాగ్వాదానికి దిగింది. దీనికి సంబంధించి దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ సందర్భంగా కేజ్రివాల్ పర్సనల్ సెక్రెటరీ బిభవ్‌కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాలివాల్ ఆరోపణలు అబద్ధమంటూ.. అందుకు రుజువుగా ఆమ్ ఆద్మీ పార్టీ సీసీ ఫుటేజ్‌ను విడుదల చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

