Lords Test : లార్డ్స్‌లో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్‌కు క్రాంతి గౌడ్(1-4) ఆదిలోనే బ్రేకిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 285కు టీమిండియాను ఆలౌట్ చేసిన ఇంగ్లండ్‌కి క్రాంతి ఊహించని షాకిచ్చింది. కొత్త బంతితో నిప్పులు చెరిగిన భార పేసర్ .. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(2)ను ఎల్బీగా వెనక్కి పంపింది. ప్రస్తుతం హీథర్ నైట్(1 నాటౌట్), మియా బౌచిర్(9 నాటౌట్)లు ఆచితూచి ఆడుతున్నారు. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 272 పరుగులు వెనకబడి ఉంది.
భారత్‌ను మూడొందల లోపే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్‌కు క్రాంతి గౌడ్ (1-4) ఆరంభంలోనే షాకిచ్చింది. ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఆతిథ్య జట్టును ఒత్తిడిలో పడేసింది. బ్యూమంట్ వికెట్‌తో ధాటిగా ఆడాలనుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లు నిదానమే ప్రధానం అన్నట్టుగా ఆడుతున్నారు. ప్రస్తుతం హీథర్ నైట్(1 నాటౌట్), మియా బౌచిర్(9 నాటౌట్)లు ఆచితూచి ఆడుతున్నారు.
There’s the early breakthrough! 🔥
Kranti Gaud traps Tammy Beaumont in front ☝️
Updates ▶️ https://t.co/O1rEau8j8n#TeamIndia | #ENGvIND pic.twitter.com/JCYf9trPmG
— BCCI Women (@BCCIWomen) July 10, 2026
చరిత్రాత్మక టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ కొడుతుందనుకుంటే మూడొందలలోపే ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్(58)లు అర్ధ శతకాలతో పటిష్టమైన పునాది వేసినా లాభం లేకపోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ మ్యాడీ విల్లియర్స్(2-79) ధాటికి మిడిలార్డర్ వైఫలమైంది. ఓవైపు వికట్లు పడుతున్నా బాధ్యతగా ఆడిన దీప్తి శర్మ(57) టెయిలెండర్లతో కలిసి పోరాడి స్కోర్ 280 దాటించింది. కానీ, ఒకే ఓవర్లో దీప్తిని, క్రాంతి గౌడ్‌ను ఔట్ చేసిన సోఫీ ఎకిల్‌స్టోన్(3-68) భారత ఇన్నింగ్స్‌కు తెరదించింది.