Lords Test : లార్డ్స్‌లో జరగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత పేసర్ క్రాంతి గౌడ్(3-25) నిప్పులు చెరిగింది. తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ నడ్డివరిచింది. స్వింగ్‌తో టాపార్డర్‌ను కూల్చిన క్రాంతి.. లంచ్ తర్వాత విజృంభించగా ఆతిథ్య జట్టు 170కే ఆలౌటైంది. అమీ జోన్స్(52), కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(44) మినహా ఎవరూ రాణించకపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 115 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. సయాలీ సత్ఘరే(1-36), స్నేహ్ రాణా(1-35) రాణించారు.
లార్డ్స్ టెస్టులో రెండో రోజు పట్టుబిగించిన భారత జట్టు పేసర్ క్రాంతి గౌడ్(5-37) సంచలన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను పడగొట్టింది. సొంతగడ్డపై దంచేయాలనుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించిన క్రాంతి.. మొదటి సెషన్లోనే కోలుకోలేని దెబ్బకొట్టింది. ఓపెనర్ మియా బౌచిర్(23)ను పెవిలియన్ చేర్చిన స్పీడ్‌స్టర్.. బౌండరీలతో చెలరేగుతున్న అలిసే క్యాప్సే(9)ను స్వింగ్‌తో వెనక్కి పంపింది. మరో ఎండ్‌లో సయాలీ సత్ఘరే(2-40), స్నేహ్ రాణా(2-41) రెచ్చిపోగా లంచ్ లోపే సగం మంది పెవిలియన్ చేరారు.
𝐅𝐚𝐧𝐭𝐚𝐬𝐭𝐢𝐜 𝐅𝐢𝐯𝐞 🖐️
What a performance by Kranti Gaud 🫡
Her maiden 5⃣-wicket haul in only her 2⃣nd Test for #TeamIndia ⭐️
Updates ▶️ https://t.co/O1rEau8j8n#ENGvIND pic.twitter.com/zpAS0KzDWr
— BCCI Women (@BCCIWomen) July 11, 2026
అర్ధ శతకం బాదిన అమీ జోన్స్ (52) వెనుదిరిగినా.. పట్టువదలకుండా క్రీజునంటుకున్న కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(44) పోరాడింది. కానీ, లంచ్ తర్వాత ఆమెను సైతం గౌడ్ వెనక్కి పంపింది. లారెన్ బెల్‌ను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో మొదటిసారి ఐదు వికెట్లు తీసింది భారత స్పీడ్‌స్టర్. చివరి బ్యాటర్ లారెన్‌ను దీప్తి ఎల్బీ చేయడంతో 170 వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 115 పరుగుల ఆధిక్యం లభించింది.