West Indies : టీ20 వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్(West Indies) త్వరలోనే మరో సిరీస్ ఆడనుంది. మెగా టోర్నీ ముగియగానే కరీబియన్ జట్టు జూలైలో ఇంగ్లండ్(England) గడ్డపై టెస్టు సిరీస్‌లో తలపడనుంది. దాంతో, ఈ టెస్టు మ్యాచ్‌ల కోసం బుధవారం విండీస్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. క్రెగ్ బ్రాత్‌వైట్(Kraigg Brathwaite) కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. సీనియర్ పేసర్ కీమర్ రోచ్, ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(Jason Holder)లు తుది బృందంలో చోటు దక్కించుకున్నారు.
నాలుగేండ్ల క్రితం ఇంగ్లండ్ పర్యటనలో విండీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఒకే ఒక మ్యాచ్‌లో గెలుపొంది 1-2తో టెస్టు సిరీస్ చేజార్చుకుంది. అయితే.. ఈ నాలుగేండ్లలో కరీబియన్ జట్టు ఆట చాలా మారింది. క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్ అయ్యాక విండీస్ టీమ్ బలంగా మారింది.
🚨BREAKING NEWS🚨
The #MenInMaroon take on England in the Richards-Botham series this summer.Read More⬇️https://t.co/goUOzfDD97#ENGvWI pic.twitter.com/Rk3Z9EwmHS
— Windies Cricket (@windiescricket) June 4, 2024
వెస్టిండీస్ స్క్వాడ్ : క్రెగ్ బ్రాత్‌వైట్(కెప్టెన్), అల్జారీ జోసెఫ్(వైస్ కెప్టెన్), అలిక్ అథనజె, జోషు డిసిల్వా, జేసన్ హోల్డర్, జేసన్ హోల్డర్, కవెం హొడ్గే, తెవిన్ ఇమ్లచ్, షమర్ జోసెఫ్, మికిలె లూయిస్, జచారీ మెక్కస్కీ, కిర్క్ మెకంజీ, గుడకేశ్ మోతీ, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్.
ఈ మధ్యే ఆస్ట్రేలియాను గబ్బా టెస్టు(Gabba Test)లో చిత్తు చేసి విండీస్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అందుకని ఈసారి ఇంగ్లండ్ పర్యటనలో బ్రాత్‌వైట్ సేన అద్భుతం చేసే చాన్స్ ఉంది. ఇరుజట్ల మధ్య జూలై 10న లార్డ్స్‌లో తొలి టెస్టు జరుగనుంది.