– పాల్గొన్న ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
కోదాడ, జనవరి 09 : కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో శుక్రవారం జయవరపు పరమేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ముగ్గుల పోటీలు, హరిదాసు కథలు, భోగి మంటలతో సందడిగా సాగింది. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జయవరపు నరేందర్ నేతృత్వంలో వరుసగా ఆరో ఏడాది ఈ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకమన్నారు. రంగురంగుల ముగ్గులతో కాలనీ వీధులన్నీ పండుగ కళను సంతరించుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

Kodada : కోదాడలో వెల్లివిరిసిన సంక్రాంతి శోభ
గత ఆరు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలతో పాటు ఇటువంటి సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్న జయవరపు నరేందర్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు మాట్లాడుతూ స్థానిక మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రతి ఏటా ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్, నూనె సులోచన, చింతకుంట్ల మంగమణి, తేప్పని శ్రీను, కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Kodada : కోదాడలో వెల్లివిరిసిన సంక్రాంతి శోభ

Kodada : కోదాడలో వెల్లివిరిసిన సంక్రాంతి శోభ