Loksabha Elections 2024 | విపక్ష ఇండియా కూటమి భేటీ : ప్రభుత్వ ఏర్పాటుపై సీతారాం ఏచూరి కీలక వ్యాఖ్యలు
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఆశలు చిగురించాయి.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఆశలు చిగురించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కసరత్తుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో విపక్ష ఇండియా కూటమి భేటీ బుధవారం సాయంత్రం సమావేశమైంది. ఈ భేటీలో పాల్గొనేందుకు వచ్చిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తొలుత తాము ఎన్నికల ఫలితాల ప్రాధాన్యతను విశ్లేషిస్తామని చెప్పారు. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై భాగస్వామ్య పార్టీలను సంప్రదిస్తామని చెప్పారు. తమకు చాలా సమయం ఉందని, ఎన్డీయే కూడా వారి ప్రయత్నాలు వారు చేసుకుంటారని అన్నారు. బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా ముందుకొస్తే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో జేడీయూ, టీడీపీ కీలకంగా మారడంతో ఆయా పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు ఇండియా కూటమి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
బిహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడులతో చర్చించే బాధ్యతను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు అప్పగించవచ్చని భావిస్తున్నారు. ఇక ఇండియా కూటమి సమావేశానికి తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, జేఎంఎం నేత కల్పనా సొరేన్ సహా పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు.
Read More :
Bomb Threat | ఢిల్లీ – టొరంటో విమానానికి బాంబు బెదిరింపులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

