Railway Employee Family Dies | రైలు ముందు దూకి.. రైల్వే ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య
Railway Employee Family Dies | రైల్వే ఉద్యోగి కుటుంబం రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఉద్యోగి, అతడి భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను రైలు పట్టాల వద్ద పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
భోపాల్: రైల్వే ఉద్యోగి కుటుంబం రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఉద్యోగి, అతడి భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను రైలు పట్టాల వద్ద పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Railway Employee Family Dies) మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సిహోడా గ్రామానికి చెందిన నరేంద్ర చాదర్ రైల్వే ట్రాక్‌మెన్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం అతడితోపాటు భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను రైలు పట్టాలపై పోలీసులు గుర్తించారు. నరేంద్ర బైక్ రైలు పట్టాల సమీపంలో పార్క్ చేసి ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నరేంద్ర, అతడి భార్య రీనా, మూడు, ఆరేళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెల మృతదేహాలను గుర్తించారు. సూసైడ్‌తో పాటు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, కుమార్తె రీనా మంగళవారం తనకు ఫోన్ చేసిందని ఆమె తండ్రి శంకర్ లాల్ తెలిపాడు. అత్తతో గొడవ జరిగినట్లు కుమార్తె చెప్పిందన్నాడు. కుటుంబంలో జరిగే సాధారణ వివాదంగా తాను భావించినట్లు తెలిపాడు. అయితే పిల్లలతో కలిసి అల్లుడు, కుమార్తె ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసి షాక్ అయ్యానని మీడియాతో అన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
Sircilla | పరిహారం పొందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఎలా?.. ప్రజావాణిలో దేశాయిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

