AP Elections | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి సంచలన విజయాన్ని అందుకుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సెగ్మెంట్లలో గెలిచింది. ప్రతిపక్షం అనేది లేకుండా విజయభేరి మోగించింది. ఈ కూటమిలో ఒక్క టీడీపీనే 135 స్థానాల వరకు గెలుపొందింది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
విజయోత్సాహంలో ఉన్న టీడీపీ నేతలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 9వ తేదీన అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో తమ పార్టీ విజయంపై టీడీపీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తమ సంతోషాన్ని తెలిపింది. గాయమైన రాష్ట్రానికి పసుపు రాసిన ప్రజలు అంటూ ట్వీట్ చేసింది. దీంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ గెలిచిందో తెలియజేసే ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను పోస్టు చేసింది. అందులో అన్ని స్థానాల్లో టీడీపీ గెలిచి.. పసుపుమయమైన ఏపీ మ్యాప్ కనిపిస్తుండటం గమనార్హం.
గాయమైన రాష్ట్రానికి పసుపు రాసిన ప్రజలు#KutamiTsunami #BabuIsBack #BossIsBack#ElectionResults #EndOfYCP #AndhraPradesh pic.twitter.com/KfEDMK8NfP
— Telugu Desam Party (@JaiTDP) June 5, 2024