IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఫ్లాట్ పిచ్‌లపై మంచినీళ్లు తాగినంత తేలికగా బౌండరీలు బాదేస్తున్నారు హిట్టర్లు. ఈ నేపథ్యంలో మరో కీలక మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఓటమితో టోర్నీని ప్రారంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్లు గువాహటిలో తలపడుతున్నాయి.
టాస్ గెలిచిన డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా సారథి అజింక్యా రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రియాన్ పరాగ్ రాజస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మెగా వేలంలో కేకేఆర్ గూటికి చేరిన మోయిన్ అలీ డెబ్యూట్ క్యాప్ అందుకున్నాడు.
🚨 Toss 🚨@KKRiders elected to bowl first against @rajasthanroyals in Guwahati
Updates ▶ https://t.co/lGpYvw87IR #TATAIPL | #RRvKKR pic.twitter.com/PVVVJoU2cz
— IndianPremierLeague (@IPL) March 26, 2025
కోల్‌కతా తుది జట్టు : క్వింటన్ డికాక్, వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకూ సింగ్, మోయిన్ అలీ, ఆండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా,
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, నితీశ్ రానా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రన్ హిట్మైర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీశ్ థీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.