Online Betting | ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై చట్టాల బాధ్యత రాష్ట్రాలదే.. లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రకటన..!
Online Betting | ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాబ్లింగ్‌కు సంబంధించిన చట్టాలను రూపొందించడం రాష్ట్రాల బాధ్యతని కేంద్రం లోక్‌సభలో స్పష్టం చేసింది. లోక్‌సభలో ఈ అంశంపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం.. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలిపారు.
Online Betting | ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాబ్లింగ్‌కు సంబంధించిన చట్టాలను రూపొందించడం రాష్ట్రాల బాధ్యతని కేంద్రం లోక్‌సభలో స్పష్టం చేసింది. లోక్‌సభలో ఈ అంశంపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం.. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఆన్లైన్ గేమింగ్ సైట్లను నిషేధించడానికి ఎందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్‌ను నిషేధించిందని, ఈ విషయంలో కేంద్రం సైతం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీనికి ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ.. రాజ్యాంగం ప్రకారం.. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ రాష్ట్రాల జాబితా (List II) కిందకు వస్తాయని, ఈ క్రమంలో చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు ఉందన్నారు. ‘రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి, దేశ సమాఖ్య నిర్మాణాన్ని గౌరవించండి’ కేంద్ర మంత్రి స్పందించారు. ఇప్పటి వరకు 1,410 ఆన్లైన్ గేమింగ్ సైట్లపై చర్యలు తీసుకున్నామని, వాటిని నిషేధించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటోందని, అయితే చట్టపరంగా తమ ప్రాంతాల్లో వాటిని నియంత్రించడం రాష్ట్రాల బాధ్యత అని పేర్కొన్నారు. ‘ఇండియన్ జస్టిస్ కోడ్’ సెక్షన్ 112 కింద ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై చర్యలు తీసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
Tejaswini | హీరోయిన్గా కాదు,నిర్మాతగా ఎంట్రీకి తేజస్విని రెడీ.. బాలయ్య కుమార్తె కొత్త ప్లాన్ ఇదే!
IND vs NZ | కివీస్ జోరుకు భారత బౌలర్ల బ్రేకులు.. 20 ఓవర్లలో మూడు వికెట్లు డౌన్
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

