IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బీసీసీఐ(BCCI) ప్రవేశ పెట్టిన ఓ నిబంధన పచ్చదనం పెంచేందుకు ఎంతగానో దోహదపడుతోంది. ప్రతి డాట్ బాల్‌కు 18 మొక్కలు(Saplings) నాటాలనే నియమాన్ని పెట్టింది. దాంతో, ప్రతి మ్యాచ్‌లో డాట్ బాల్స్‌ను లెక్కించి మరీ.. అందుకు సరిపడా మొకల్ని నాటుతున్నారు క్రికెటర్లు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఆటగాళ్లు ఈ పచ్చదనం పండుగలో భాగమయ్యారు.
చెన్నై సూపర్ కింగ్స్‌పై భారీ విక్టరీ అనంతరం కోల్‌కతా ప్లేయర్లు ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఆ ఫొటోలను కోల్‌కతా ఫ్రాంచైజీ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దానికి.. 61 డాట్ బాల్స్.. 1,098 మొక్కలు నాటాము అని క్యాప్షన్ జోడించింది కేకేఆర్ యాజమాన్యం. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, మోయిన్ అలీ, హర్షిత్ రానా, వైభవ్ అరారా.. మొక్కలు నాటుతూ నవ్వులు చిందుస్తున్న ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
61 dots bowled, 1098 trees planted 💜 pic.twitter.com/US2pPrl0Ls
— KolkataKnightRiders (@KKRiders) April 13, 2025
డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ మళ్లీ గాడిలో పడింది. శుక్రవారం చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయంతో టాప్ – 5లోకి దూసుకొచ్చింది. చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లు ఏకంగా 61 డాట్ బాల్స్ వేశారు. అంటే.. దాదాపు 10 ఓవర్లు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తొలుత సీఎస్కేను 104కే కట్టడి చేసిన కోల్‌కతా స్వల్ప లక్ష్యాన్ని 10.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇప్పటివరకూ ఆడినఆరు మ్యాచ్‌ల్లో కోల్‌కతా బౌలర్లు 243 డాట్ బాల్స్ వేయడం విశేషం. అయితే.. గుజరాత్ టైటన్స్ మాత్రం అతి తక్కువగా 197 డాట్ బాల్స్ నమోదు చేసింది.
We’ll meet again. See you in Eden! 💜🤝💛 pic.twitter.com/gHetSf5mYA
— KolkataKnightRiders (@KKRiders) April 11, 2025