Meenakshi Chaudhary | టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబీకులతో వచ్చిన నటికి దేవస్థానం అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి.. శేషవస్త్రంతో సత్కరించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. పలువురు భక్తులు మీనాక్షితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
మీనాక్షి సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో నటించింది. అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో హీరోగా విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రలు పోషించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్ రాబట్టింది. ప్రస్తుతం నవిన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు మూవీలోనూ హీరోయిన్గా నటిస్తున్నది.