IPL 2025 : రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (56) హాఫ్ సెంచరీ బాదాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్థ శతకం సాధించాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టిన యశస్వీ యాభైకి చేరువయ్యాడు. కెప్టెన్ సంజూ శాంసన్‌తో కలిసి తొలి వికెట్‌కు 49 రన్స్ జోడించిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ప్రస్తుతం రియాన్ పరాగ్(30)తో కీలక భాగస్వామ్యం నిర్మిస్తున్నాడు. వీళ్లిద్దరూ దూకుడుగా ఆడుతుండడంతో 13 ఓవర్లకు రాజస్థాన్ వికెట్ నష్టానికి 104 రన్స్ చేసింది.
జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో, రాజస్థాన్ రాయల్స్ పపర్ ప్లేలో 45 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ కాసేపటికే ఫామ్‌లో ఉన్న కెప్టెన్ సంజూ శాంసన్ (15) ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి సంజూ వెనుదిరిగాడు.