అమరావతి : ఆంధ్రప్రదేశ్( Andhar Pradesh ) లో అనకాపల్లి ( Anakapalli) జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా ( Fire works ) తయారీ కేంద్రంలో ఆదివారం బాణసంచా పరిశ్రమలో పేలుడు ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. పరిశ్రమలోని బాణసంచా పేలుడికి గురు చనిపోగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.
కాగా చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు చనిపోవడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. మృతులు అప్పికొండ తాతబాబు, సంగ రాతి గోవింద్, దాడి రామలక్ష్మి, దేవర నిర్మల, పురంపాప, గుంపిన వేణుబాబు, శానవెల్లి బాబురావు, చదలవాడ మనోహర్లుగా గుర్తించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేష్( Nara Lokesh), వంగల పూడి అనిత ( Minitser Anita ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనను సీఎం చంద్రబాబు మంత్రి అనితను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు.